Nayanthara will give a house worth Rs 20 crore as a gift to her husband
mictv telugu

రూ.20 కోట్ల ఇంటిని భర్తకు బహుమతిగా ఇవ్వనున్న నయన్

June 8, 2022

Nayanthara will give a house worth Rs 20 crore as a gift to her husband

మరికొన్ని గంటల్లో డైరెక్టర్ విఘ్నేష్ శివన్, లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ఈ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మహాబలిపురంలో రేపు ఉదయం గం 8.30కు వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. అతికొద్ది మంది బంధువుల, స్నేహితుల మధ్య ఈ వేడుక జరుగనుంది. ఈ పెళ్లికి హాజరయ్యే అతిథులు కూడా డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనట.

అయితే కాబోయే భర్తకు నయనతార ఖరీదైన ఇల్లును బహుమతిగా ఇవ్వనున్నారని తెలుస్తోంది. సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ ఇంటి ఖరీదు ఏకంగా 20 కోట్ల రూపాయలు. ఈ ఇంటిని భర్త విఘ్నేష్ శివన్ పేరుపై నయనతార రిజిస్ట్రేషన్ చేయించనున్నారట. పెళ్లి తర్వాత నయనతార బహుమతిగా ఇచ్చిన కొత్త ఇంట్లోనే నూతన దంపతులు కాపురం పెట్టనున్నారట.

మరోవైపు విఘ్నేష్ శివన్ సైతం నయనతార కోసం ఖరీదైన నగలు కొనుగోలు చేశారట. నయనతారకు విఘ్నేష్ ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. పెళ్లి కోసం నయన్ విఘ్నేష్ దంపతులు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.