నయనతార కొత్త పాత్ర.. అమ్మమ్మ జగదంబవే..   - MicTv.in - Telugu News
mictv telugu

నయనతార కొత్త పాత్ర.. అమ్మమ్మ జగదంబవే..  

June 4, 2020

Nayanthara's Mookuthi Amman First Looks Released

అగ్ర హీరోలతో మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నయన తార. చాలా సినిమాల్లో విభిన్న పాత్రలను ఆమె పోషించింది. తాజాగా మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆధ్యాత్మిక సినిమాగా తెరకెక్కుతున్న ‘అమ్మన్’లో ఆమె విలక్షణ పాత్ర చేయబోతోంది. అమ్మవారి అవతారంలో ఉండే సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. దీంతో ఇది చూసిన అభిమానులు.. నిజంగా జగదంబలాగే ఉందని కామెంట్లు పెడుతున్నారు. 

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ‘మూకుతి అమ్మన్ ’అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో నయనతార గెటప్‌‌కు సంబంధించిన పలు ఫోటోలు విడుదలయ్యాయి. ఇందులో మూకుతి అమ్మన్ గా నయన్ లుక్ అదిరిపోయింది. కష్టాలలో ఉన్న కుటుంబంకి మూకుతి అమ్మన్ ఎలా అండగా ఉందనే కోణంలో  ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. కాగా ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు చేసిన నయన్ తొలిసారి అమ్మవారి రూపంలో కనిపించడం అందరిని ఆకట్టుకుంటోంది.