అందాల నయనతారేనా?  గుర్తుపట్టలేనంతంగా (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

అందాల నయనతారేనా?  గుర్తుపట్టలేనంతంగా (వీడియో)

November 25, 2019

Nayanthara's throwback video

‘చంద్రముఖి’ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది లేడీ సూపర్ స్టార్ నయనతార. అయితే ఆమె కెరియర్ ఆ సినిమాతోనే ప్రారంభం కాలేదు. రజినీకాంత్ మాదిరి బస్ కండక్టర్ నుంచి సినిమా హీరోగా ఎదిగినట్టే.. నయనతార కూడా కిందిస్థాయి నంచే వచ్చారు. తొలుత ఆమె ఓ మాలయాళం టీవీ ఛానల్‌లో యాంకర్‌గా తన కెరియర్ ప్రారంభించారు. అప్పుడు నయన్ వయసు 16 ఏళ్లు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నయన్ ఇంతవరకు ఎక్కడా ఇంటర్వ్యూలు ఇవ్వలేరు గనక. తన పర్సనల్ విషయాలు ఎవ్వరికీ తెలియదు. తాను నటించిన సినిమా ప్రమోషన్లలోనే నయన్ పాల్గొనదు అనే విషయం తెలిసిందే.

నయన్ యాంకర్‌గా వార్తలు చదువుతున్నప్పుడు వీడియోలో ‘నా పేరు డయానా మరియం కురియన్’ అంటూ తన గురించి తాను పరిచయం చేసుకుంటూ కనిపించారు. యాంకర్‌గానూ నయన్ స్టైలిష్‌గా ఉన్నారు. అసలు నయనతారేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. తమిళం, మలయాళం సినిమాల్లో మాత్రమే నయన్ తన సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పుకుంటారు. కానీ తెలుగులో మాత్రం ఆమెకు ఇతరులు డబ్బింగ్ చెబుతారు. దీంతో తొలిసారి నయన్ ఒరిజినల్ వాయిస్ విని తెలుగు ఫ్యాన్స్‌ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కాగా, నయన్ 2003లో వచ్చిన ‘మనస్సినక్కరే’ అనే మలయాళం సినిమాతో టీవీ యాంకర్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 15 ఏళ్ల సినీ కెరీర్‌లో నయన్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నయన్ డేట్ల కోసం హీరోలు వెయిట్ చేసేంతగా పేరు తెచ్చుకున్నారు.