నయీం మేనకోడలిని డబ్బు కోసం  చంపేశారా? గతంలో జైలుకు..   - MicTv.in - Telugu News
mictv telugu

నయీం మేనకోడలిని డబ్బు కోసం  చంపేశారా? గతంలో జైలుకు..  

January 13, 2020

Nayeem.

కరడగట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు సాజీదా షాహీనా (35) మరణంపై కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజంగా ఆమె కారుకు జరిగింది ప్రమాదమేనా.. లేక ఎవరైనా కావాలనే ప్లాన్ ప్రకారం హతమార్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెపై గతంలో అనేక కేసులు, భూ వివాదాలు ఉండటంతో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. 

నయీం కేసుల్లో సాజీదా షాహీన్ ముద్దాయిగా ఉంది. మేనమామ సాయంతో ఓ దశలో ఆమె లేడీ డాన్‌గా మారిపోయింది. ఆమెపై కోట్ల విలువైన బినామీ ఆస్తులు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. వీటిలో కొన్ని తగాదాల్లో ఉండటంతో హత్యకోణం దాగి ఉందనే అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. బెదిరింపులు, ఆస్తుల కబ్జాతో చాలా మంది ఆమెపై కక్ష కట్టినట్టుగా తెలుస్తోంది. కాగా ఆదివారం నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి – అద్దంకి జాతీయ రహదారిపై ఓ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో సంఘన స్థలంలోనే ఆమె మరణించింది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.