వెనక్కి తగ్గిన నాయిని.. కేసీఆరే మా నాయకుడని..  - MicTv.in - Telugu News
mictv telugu

వెనక్కి తగ్గిన నాయిని.. కేసీఆరే మా నాయకుడని.. 

September 11, 2019

narasimhareddy

ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని విమర్శించిన మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి వెనక్కి తగ్గారు. తాను మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడితే దానిపై అనవసరంగా రాద్ధాంతం చేశారని విలేకర్లను విమర్శించారు. ‘మీడియాలో వచ్చిన వార్తలపై కేసీఆర్ నన్ను అడిగారు. ఎవరేం అనుకున్నా టీఆర్ఎస్ మా పార్టీనే. కేసీఆరే మా నాయకుడు.. పదవులు మాకే వస్తాయి. మాకు చాలా హామీలు ఉన్నాయి.. ’ అని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. కేసీఆర్‌ తనను ఎప్పుడు పిలిచినా వెళ్లి మాట్లాడతానని చెప్పారు. 

మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు ఉంటుందని చెప్పిన కేసీఆర్ హామీ నిలబెట్టుకోలేదని, తన అల్లుడికి కూడా అసెంట్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వలేని నాయిని ఆరోపించడం తెలిసిందే. టీఆర్ఎస్‌కు తాను కూడా ఓనర్‌నే అని ఆయన అన్నారు. తనకు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నట్టు వార్తలొచ్చాయని, హోం మంత్రిగా పనిచేసిన తాను ఆ పదవిని ఎలా తీసుకుంటానని అన్నారు.