పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజాకు ఆ దేశ సర్కార్ ఉద్వాసన పలికింది. రమీజ్ రాజాను తప్పించబోతున్నారనే వార్తలను నిజం చేస్తూ అతడిపై వేటు వేసింది. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోటిఫికేషన్ జారీ చేశారు. రమీజ్ రాజా స్థానంలో నజమ్ సేథీని అధ్యక్షుడిగా.. 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. వచ్చే నాలుగు నెలలు సేథి ఈ పదివిలో కొనసాగనున్నారు. కొత్త కమిటీలో షాహిద్ అఫ్రిది, హరూన్ రషీద్, మహిళా క్రికెటర్ సనా మిర్‌కు కూడా స్థానాలు దక్కాయి. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో పాక్ 0-3తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు టెస్టులకు పిచ్ లను సరిగ్గా తయారు చేయాలేకపోయారని రమీజ్ రాజాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో భారత్, టీంఇండియాపై రమీజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆసియాకప్ కోసం పాక్‌లో ఆడేది లేదని బీసీసీఐ ప్రకటించనప్పుడు రమీజ్ రాజా తన వక్రబుద్ధిని బయటపెట్టారు.
పీసీబీ చైర్మన్ గా రమీజ్ రాజా 2021లో నియమితులయ్యారు. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పీటీఐ ప్రభుత్వం అతనిని నియమించింది. సుమారు ఆయన 15 నెలలుగా పదవిలో కొనసాగారు. కొత్త నియమితులైన సేథీ కూడా 2013-18 కాలంలో పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్, సీఈవోగా పనిచేశారు.