బాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. టీవీ నటి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. టీవీ నటి అరెస్ట్

October 25, 2020

NCB

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఆ కేసు ఒక్కసారిగా డ్రగ్స్ మలుపు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. యువ హీరోయిన్లు దీపికా పడుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌లను ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీకి తాజాగా టీవీ నటి ప్రీతికా చౌహన్ పట్టుబడింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెండ్‌గా ఎన్సీబీ అధికారుల చేతికి చిక్కింది. 

ఖిల్లా కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు వెల్లడించారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న ముంబై ఎన్సీబీ అధికారులు వెర్సోవా, ముంబైలలో మోహరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ‘సంవాదన్ ఇండియా’, ‘దేవో కే దేవ్ మహదేవ్’ వంటి సీరియళ్లలో నటించిన ప్రీతికా నటిగా ప్రేక్షకుల మన్ననలు పొందింది.