శరద్ పవార్‌ కాన్వాయ్ కారు బోల్తా! - MicTv.in - Telugu News
mictv telugu

శరద్ పవార్‌ కాన్వాయ్ కారు బోల్తా!

June 29, 2020

Sharad Pawar.

రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన‌ కాన్వాయ్‌ లోని ఓ వాహనం ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై పుణెలోని ఖండాలా వద్ద ఈరోజు ఉదయం 9.30 గంటలకు బోల్తా పడింది. 

అప్పటికే ఆయన ప్రయాణిస్తున్న కారు ముందుకు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్‌కు, కొంత మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్పిటల్ కి తరలించారు. కాగా, శరద్ పవర్ 2019 ఎన్నిక తరువాత కాంగ్రెస్, శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.