కమలంపై శివసేన, ఎన్సీపీ కార్టూన్లు - MicTv.in - Telugu News
mictv telugu

కమలంపై శివసేన, ఎన్సీపీ కార్టూన్లు

October 30, 2019

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడి వారం కావస్తున్న ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. సీఎం పదవి సగ కాలం ఇస్తేనే మద్దతు తెలుపుతామని శివసేన మొండిపట్టు పట్టింది. కానీ, బీజేపీ మాత్రం ఇందుకు ససేమీరా అంటోంది. మధ్యలో ఎన్సీపీ పార్టీ శివసేనకు మద్దతు తెలుపుతోంది. దీంతో ఏం చేయాలో బీజేపీ శ్రేణులకు తోచడం లేదు. ఈ క్రమంలో శివసేన, ఎన్సీపీ నేతలు బీజేపీ పరిస్థితిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్ చిరుత పులి చేతిలో కమలం ఉన్నట్లు ఓ కార్టూన్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి… రిమోట్ కంట్రోల్ తమ చేతిలో ఉందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా, ఎన్సీపీ నేత క్లైడ్ క్రాస్టో ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలంపై శివసేన బాణం గుర్తు ఎక్కుపెట్టినట్లు ఉన్న కార్టూన్‌ వేసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బీజేపీని శివసేన గురి చూసి కొడుతుందనేలా ఈ కార్టూన్ ఉంది.