NCW receives complaint against Andhra MP Gorantla madhav seeks action from LS speaker
mictv telugu

చిక్కుల్లో గోరంట్ల.. జాతీయ మహిళా కమిషన్ నోటీసు

August 11, 2022

 NCW receives complaint against Andhra MP Gorantla madhav seeks action from LS speaker

వైకాపా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వ్యవహారం జాతీయ స్థాయిలోనూ కలకలం రేపుతోంది. గౌరవనీయ హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి పనికి పాల్పడ్డడంపై చర్య తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ జస్బీర్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఎంపీలకు మాయని ఆ వ్యవహారం మచ్చ తెచ్చేలా ఉందని, ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్(మగ వేశ్య) అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో వైపు ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు అందింది. ‘ఆ వీడియోలోని వ్యవహారం అసభ్యంగా, అసహ్యంగా ఉంది’ అని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్య తీసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. స్వంతంత్ర దర్యాప్తు జరిపించి సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీని కూడా ఆదేశించారు. మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియోలో మాట్లాడుతున్న వీడియో మీడియాలకు ఎక్కడం, అది ఒరిజినల్ కాదని, అసలైంది తన దగ్గరుందని అంటూ ఆయన టీడీపీ నేతలను బూతులు తిడుతుండడం తెలిసిందే.