చంద్రబాబు ఎన్డీఏను వీడకపోవడానికి ఆ మూడోదే కారణం! - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు ఎన్డీఏను వీడకపోవడానికి ఆ మూడోదే కారణం!

March 9, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హాదా ఇవ్వనందుకు నిరసనగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కేబినెట్ నించి టీడీపీ తన ఇద్దరు మంత్రులను బయటికి తీసుకురావడం తెలిసిందే. అయితే తాము ఇకపైనా ఎన్డీఏ కూటమిలో ఉంటామని, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. హోదా ఉద్యమం తీవ్రమైన ప్రస్తుత తరుణంలో టీడీపీ.. ఎన్డీఏ కూటమి నుంచి కూడా తప్పుకుంటే కేంద్రం తప్పకుండా దిగొచ్చి హోదా ప్రకటిస్తుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై బాబు స్పందించడం లేదు. ఎందుకు?మార్చి 23న ఎన్నికలు..

ఏపీలోని ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు మార్చి 23న ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ రెండు సీట్లలో, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఒక సీటులో ఈజీగా గెలిచే అవకాశముంది. ఎమ్మెల్యేల ఫిరాంపులను ప్రోత్సహిస్తే టీడీపీ.. వైకాపాకు చెక్ పెట్టి మూడో సీటులోనూ గెలిచే అవకాశముంది. ఈ మూడో సీటు గెలవడానికి 44 ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా టీడీపీకి 43 మంది మద్దతు వుంది. అయితే వీరిలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు. కాస్త వ్యూహం పన్ని ఒక వైకాపా ఎంపీని తమవైపు లాక్కుంటే మూడోదీ దక్కుంది. అయితే టీడీపీ ఇప్పటికిప్పుడు ఎన్డీఏతో తెగతెంపులు చేసుకుంటే  నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతివ్వరు కనుక మూడో సీటును కావాలసిన మద్దుతు ఉండదు.

175 మంది ఎమ్మెల్యేలున్న ఏపీలో ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. వైఎస్సార్ సీపీకి కచ్చితంగా 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు(23 మంది టీడీపీలోకి జంప్ కాగా మిగిలినవారు). కనుక ఆ పార్టీకి ఒక సీటు దక్కుతుంది. వీరు టీడీపీలోకి ప్లేటు ఫిరాయించకుండా జగన్ వీరిని రహస్య ప్రాంతంలో ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మూడో రాజ్యసభ సీటును కూడా కొల్లగొట్టడానికే బాబు ఎన్డీఏతో ఇంకా తెగతెంపులు చేసుకోవడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నెల 11న జరిగే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన ఎన్డీఏతో అనుబంధం కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.