బీహార్ బలా బలాలు...! - MicTv.in - Telugu News
mictv telugu

బీహార్ బలా బలాలు…!

July 26, 2017

బీహార్ అసెంబ్లీలో బలా బలాలు ఈవిధంగా ఉన్నాయి, మొత్తం 243 లకు గానూ అందులో  కాంగ్రెస్ 27, ఆర్ జెడి 80(లాలూ ప్రసాద్ యాదవ్) ,జె డియు 71(నితీష్ కుమార్), NDA (59)  ఇతరులు (6) అయితే ఇది 2015 అధికారిక లెక్క, ఈ సమీకరణం  మారే అవకాశం ఉంది.ఎవరు ఎటువైపు పోతారో, ఉంటారో తెలియాల్సింది ఉంది.ఇగ రేపటినుంచి మీడియా అంకెల గారడీ మీదనే.. బీహార్ రాజకీయం ఆధారపడి ఉంది.ఎటు చూసినా స్పష్టమైన మెజారిటీ మాత్రం ఎవరికి వచ్చే అవకాశం కనబడడంలేదు.

ఎన్ డి ఎ  కూటమి నితీష్ కు మద్దతునిస్తే  అపుడు కాంగ్రెస్ ,లాలూ ప్రసాద్ లు కలిసే అవకాశముంది.ఈ కలయిక కనక నిజమైతె ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 122,  ఎన్ డి ఎ ,నితీష్ లు కలిస్తే 130,అట్లాగే ఆర్ జెడి,కాంగ్రెస్ లు కలిస్తే 107. ఈలెక్కన నితీష్ మరియు ఎన్ డిఎ కు  ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసే నైతికత ఉంటుంది.అయితే సోషలిస్ట్ రాజకీయాలతో బహుజన ఎజెండాతో ఉన్న  నితీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చర్చ,బిజెపి తో కలుస్తారా లేదా అనేది చూడాలి.రాజకీయాల్లో క్లీన్ చీట్ నితీష్ కుమార్ ఇపుడు రాజకీయాలు ఎట్లా చేస్తారో చూడాలి.