రద్దైన పెద్ద నోట్ల లెక్క తేలడం లేదు... ఎందుకంటే.......... - MicTv.in - Telugu News
mictv telugu

రద్దైన పెద్ద నోట్ల లెక్క తేలడం లేదు… ఎందుకంటే……….

July 13, 2017

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎన్ని నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయో  ఇంకా తెలియడం లేదని అంటున్నారు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్  పటేల్. ఇదే విషయాన్ని పార్లమెంట్ ప్యానెల్ కమిటీకి చెప్పారు. నోట్లు  లెక్కించడానికి ప్రత్యేక  టీమ్ ను ఏర్పాటు చేశామని అంటున్నారు. రద్దైన నోట్లు 17.7 లక్షల కోట్ల రూపాయలని ఇంతకు ముందే చెప్పారు.  కొత్త నోట్లు, జనంలో  చలామణిలో ఉన్న నోట్లు15.4 లక్షల కోట్ల రూపాయలు. గుండు గుత్త లెక్క చెప్పినా ఏదో సమాధాన వస్తుంది. అయినా  ఆరు నెలల తర్వాత కూడా బ్యాంకుల్లో ఎన్ని నోట్లు జమయ్యాయో తెలియడం లేదట. గత యేడాది నవంబర్ 8న హఠాత్తుగా ప్రధాన  నరేంద్ర మోడీ  500, 1000 నోట్లు రద్దు చేశారు. నోట్ల డిపాజిట్ కు అవకాశం ఇచ్చారు. అప్పటి నుండి నోట్లు జమ అవుతూనే ఉన్నాయి. గడువు ముగిసిన తర్వాత కూడా  లెక్క తేలడం లేదట.

ఎందుకీ పరిస్థితి అంటే నేపాల్ నుండి, కోఆపరేటీవ్ బ్యాంకు ల నుండి రద్దైన నోట్ల ఇంకా వస్తున్నాయని చెప్పారు పటేల్. పోస్టాఫీసుల్లో జమ అయినవి ఇంకా బ్యాంకులకు రాలేదట. ఇంత పెద్ద వ్యవస్థ ఉండి మరిన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారో. మరిప్పుడు ఏర్పాటు చేస్తున్న స్పెషల్ టీమ్ కు ఎంత కాలం పడుతుందో లెక్క తేల్చడానికి.

ఎక్కడికక్కడ కంప్యూటర్లే ఉన్నవి. రద్దైంది కేవలం 500, 1000 నోట్లే కదా. చిల్లర కానే కాదు. మరింత సమయం ఎందుకు పటేలా…… పాపం ఆయన కష్టాలేమిటో మరి. అయితే రద్దైన నోట్లు జనాలకే కాదు… బ్యాంకులకు మాంచి పాఠం నేర్పాయి. ముందు ముందు మోడీకి కూడా నేర్పుతాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు. నోట్ల రద్దు…. చారిత్రక నిర్ణయం అయతే… రెండు మూడు తరాలను ఒకే సారి లైన్లో…  అదీ రోడ్లపై  నిలబెట్టిన ఘనత మోడీ సాబ్ కే దక్కతుంది. ఈ రద్దైన నోట్ల లెక్క తేలేలోపు…ఏ కొత్త పరిణమాలు వస్తాయో మరి.