ndia's population will decrease by 100 crores by 2100
mictv telugu

2100 నాటికి భారత్ జనాభా..100 కోట్లు తగ్గుతుంది..

July 23, 2022

ndia's population will decrease by 100 crores by 2100

ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో చైనా దేశం మొదటిది అయితే, రెండవ దేశం భారత్‌ది. అయితే, 2100వ సంవత్సరం నాటికి భారతదేశ జనాభా ఏకంగా 100 కోట్ల వరకు తగ్గుతుందని స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

జనాభా తగ్గడానికి గల ప్రధాన కారణాలుగా..”భారతదేశంలో ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు ఒక మహిళకు సగటున 1.79 జననాలుగా ఉంటే, 2100 నాటికి అది 1.19కు తగ్గుతుంది. అంటే ఒక మహిళ సగటున ఒకరికే జన్మనిస్తుంది. దేశాలు సుసంపన్నంగా మారితే, సంతానోత్పత్తి రేటు తగ్గడం సహజం. మార్పులకు అనుగుణంగా, ఆర్థిక సమస్యల కారణంగా భారతీయులు ఎక్కువ సంతానానికి ఆసక్తి చూపారు” అనే విషయాలను వెల్లడించింది.

”వచ్చే 78 సంవత్సరాల్లో భారత్‌లో జనాభా 41 కోట్లు తగ్గిపోయి, 100 కోట్లకు పరిమితం అవుతుంది. భారత్‌లో జనాభా అంతరించిపోవడం వల్ల విజ్ఞానం, జీవన ప్రమాణాలు స్తుబ్దుగా ఉంటాయి. ప్రస్తుతం భారత్‌లో ప్రతీ చదరపు కిలోమీటర్‌కు 476 మంది జీవిస్తున్నారు. అదే చైనాలో 148గానే ఉంది. భారత్‌లో 2100 నాటికి జనసాంద్రత చదరపు కిలోమీటర్‌కు 335కు తగ్గుతుంది. భారత్‌లోనే కాదు, చైనా, అమెరికాలోనూ జనాభా క్షీణత పరిస్థితులు ఉంటాయి. 2100 నాటికి చైనా జనాభా 93 కోట్లు తగ్గిపోయి 49.4 కోట్లకు పరిమితం అవుతుంది” అని సంతానోత్పత్తి రేటు ఆధారంగా ఈ అంచనాలను వేసినట్లు స్టాన్ ఫోర్డ్ అధ్యయనం తెలిపింది.