Nearly $1 Billion Loss In Zomato's Value In Two Days After Blinkit Deal
mictv telugu

బ్లింకిట్‌ డీల్: జొమాటోకు భారీ షాక్

June 28, 2022

Nearly $1 Billion Loss In Zomato's Value In Two Days After Blinkit Deal

దేశంలో ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తున్న జొమాటోకు భారీ షాక్ తగిలింది. కిరాణా డెలివరీ స్టార్టప్ బ్లింకిట్‌ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కొనుగోలు ఒప్పందమే అందుకు కారణం. ఈ ఒప్పందంపై పెట్టుబడీ దారులు ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో జొమాటో లిమిటెడ్ షేర్లు వరుసగా రెండవ రోజు నష్టపోయి మంగళవారం 8.2 శాతం వరకు పతమైంది. మొత్తం రెండు రోజుల్లో 14.07 శాతం నష్టపోయింది. దాదాపు ఒ‍క బిలియన్ డాలర్ల(రూ.100 కోట్లు) మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.

కాగా.. ఇదివరకు గ్రో ఫర్స్‌ ఇండియాగా ఉన్న బ్లింకిట్‌ ను రూ.4,447.5 కోట్లు చెల్లించి స్వాధీనం చేసుకోవడానికి జోమాటో ఒప్పందం కుదర్చుకుంది. శుక్రవారం జరిగిన జొమాటో బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. బ్లింకిట్‌ కామర్స్‌కు చెందిన 33,018 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి.. ఒక్కో షేరుకి రూ. 13.45 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు జొమాటో తెలిపింది. కాగా.. జొమాటోకు చెందిన 62.85 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించడం ద్వారా లావాదేవీని పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. రూ.1 విలువగల ఒక్కో షేరునీ రూ. 70.76 సగటు ధరలో జారీ చేయనున్నట్లు తెలిపింది.