కొత్త ఎంపీల్లో 50%  మందిపై రేప్, హత్య.. మరెన్నో కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త ఎంపీల్లో 50%  మందిపై రేప్, హత్య.. మరెన్నో కేసులు

May 25, 2019

కొత్తగా కొలువుదీరనున్న 17వ లోక్‌సభ నేర చరితులతో కళకళలాడనుంది. ఎవరి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఏకంగా 50 శాతం మందికిపైగా గౌరవనీయ పార్లమెంటు సభ్యులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిలో కొందరిపై అత్యాచారం, హత్య, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు వంటి తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. కొందరు దోషులుగా కూడా ఉన్నారు.  నేరచరితుల్లో ఎక్కువ మంది అధికార ఎన్డీయే కూటమి నుంచే ఉన్నారు. 303 మంది బీజేపీ ఎంపీల్లో 116 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 29 మంది కాంగ్రెస్, 10 మంది డీఎంకేక ఎంపీలపైనా క్రిమినల్‌ కేసులున్నాయి. నేరచరితుల సంఖ్య గత లోక్ సభ కంటే(184 మంది) ఏకంగా 44 శాతం అధికం కావడం గమనార్హం.

తాజా ఎన్నికల సందర్భంగా ఎంపీ అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో ఈ వివరాలు ఉన్నాయి. కొత్త ఎన్నికైన 539 మంది ఎంపీల్లో 233 మందిపై కేసులు ఉన్నాయి.162 మందిపై క్రిమినల్‌ కేసులు ఉండగా, 159 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళా వేధింపులు తదితర కేసులు ఉన్నాయి. 2014 లోక్‌సభలో ఈ కేసులు ఉన్నవారు కేవలం 112 మందే. కొత్త ఎంపీల్లో ఇడుక్కి(కేరళ) కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌ కురియాకోసేపై అత్యధికంగా 204 కేసులు నమోదయ్యాయి.