ఇంట్లోనే కటింగ్‌ను పర్‌ఫెక్ట్‌గా చేసుకోవడం ఇలా..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఇంట్లోనే కటింగ్‌ను పర్‌ఫెక్ట్‌గా చేసుకోవడం ఇలా..(వీడియో)

May 22, 2020

Need a haircut in lockdown? Try the jugaad technique

లాక్ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా సెలూన్ షాపులు మూతపడిన సంగతి తెల్సిందే. ప్రజల జుట్టు సమస్యలను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన లాక్ డౌన్ సడలింపుల్లో సెలూన్ షాపులు తెరచుకోవడానికి అనుమతి ఇచ్చింది. కరోనా భయంతో అయినా కూడా కొందరు ప్రజలు సెలూన్ షాపులకు వెళ్లడం లేదు. ఇంట్లోనే కటింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెటిజన్లకు ఏంతో నచ్చుతోంది. ఇంట్లోనే సులభంగా కటింగ్‌ ఎలా చేసుకోవాలో ఆ వ్యక్తి స్టెప్‌ బై స్టెప్‌ వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు. 

స్టెప్ 1. ఒక న్యూస్‌ పేపర్‌ తీసుకొని దానికి మధ్యలో గుండ్రంగా కట్‌ చేసుకోవాలి. 

స్టెప్ 2. ఆ రంధ్రం ద్వారా తలని దూర్చాల్చి. జుట్టు శరీరంపై పడకుండా సెలూన్‌లో వాడే క్లాత్‌ మాదిరి. 

స్టెప్ 3. ఒక దువ్వెన, బ్లేడ్‌, క్లిబ్‌ తీసుకోవాలి. దువ్వెన, బ్లేడ్‌ను హెచ్చు తగ్గులుగా పెట్టి క్లిబ్‌ని అటాచ్‌ చేయాలి.

స్టెప్ 4. గట్టిగా ఫిక్స్‌ చేసిన తర్వాత హెయిర్‌స్టైల్‌ దువ్వుకున్నట్లు దువ్వుకుంటే పెరిగిన జుట్టంతా బ్లేడ్‌కు వచ్చేస్తుంది. 

ఈ విధంగా ఆ వ్యక్తి తానంతట తానే హెయిర్‌కట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.