కోడి కూర తీనేందుకు.... లీవ్ కావాలి - MicTv.in - Telugu News
mictv telugu

కోడి కూర తీనేందుకు…. లీవ్ కావాలి

June 22, 2017

తిండి కోసం బండి కట్టే వాళ్ల గురించి విన్నం… కొందర్నీ చూస్తం కూడా. అయితే తిండి తినేందుకు  సెలవు కావాలని అడిగే వారుంటారా…ఉన్నారు.. చత్తీస్ ఘడ్ రాష్ట్రం  బిలాస్ పూర్ జిల్లాకు చెందిన స్టేషన్ మాస్టర్  పంకజ్ రాజ్ ఈ సెలవు కోరాడు. త్వరలో శ్రవణ మాసం రాబోతున్నది. అప్పుడు చికెన్ తినడానికి వీలు కాదు. కాబట్టి ఈనెల 20 నుండి 27 వరకు తనకు లీవ్ కావాలని కోరారు. ఈ వారం రోజులు బాగా  చికెన్ తిని బలం తెచ్చుకుని బాగా పనిచేస్తానని లెటర్ రాశాడు.  మరి ఈ చికెన్ ప్రేమికుని గోడును అధికారులు పట్టించుకున్నారో  లేదో తెలియదు. కానీ ఈయన రాసిన లెటర్ మాత్రం హల్ చల్ చేస్తున్నది.