గొంతులోంచి బాకులా దూసుకెళ్లిన చేప..  - MicTv.in - Telugu News
mictv telugu

గొంతులోంచి బాకులా దూసుకెళ్లిన చేప.. 

January 22, 2020

bn nm

కొన్ని చేపలు ప్రమాదకరంగా ఉంటాయి. చూడగానే దడ పుట్టిస్తున్నాయి. వాటికి పెద్దన్న ఈ చేప. ఓ బాలుడి గొంతులోంచి తూటాలా దిగిపోయి మెడ వెనక బయటికి పొడుకుకొచ్చింది. అదృష్టవశాత్తూ వైద్యులు వెంటనే చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఇండోనేసియాలోని సులవేసి రాష్ట్రం బూటన్ నదిలో శనివారం తల్లిదండ్రులతో కలసి చేపల వేటకు వేటకు వెళ్లిన మహమ్మద్ ఇబ్దుల్ అనే బాలుడు రాకాసి చేప బారిన పడ్డాడు. 

రంపాన్ని పోలిన ముక్కుతో ఉండే ‘నీడిల్ ఫిష్’ జాతి చేప ఇబ్దుల్ గొంతులోంచి వెళ్లిపోయింది. బయటికి తీస్తే మరింత రక్తస్రావం అవుతుందని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రెండు గంటలపాటు అతిజాగ్రత్తగా చికిత్స చేసి చేప ముక్కును తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి బాగానే ఉందని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే కొంతకాలం ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు చెప్పారు. నీడిల్ ఫిష్ జాతి చేపలు నీటిలో వేగంగా ఈదుతాయి. గంటకు 60 కి.మీ. వేగంగా ఇవి పైకి ఎగిరిపడతాయి. ఇవి జాలర్ల గుండెల్లోకి, కళ్లలోకి దూసుకెళ్తే మరణం తథ్యం. ఈ చేపలు చాలామందిని బలిగొంటున్నా జీవనోపాధి కోసం జాలర్లు అవి ఉన్న నీటిలోకి వెళ్లక తప్పడం లేదు.