కరోనా ఫర్నీచర్.. నీల్‌కమల్ నుంచి మంచాలు, బెడ్లు  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఫర్నీచర్.. నీల్‌కమల్ నుంచి మంచాలు, బెడ్లు 

May 20, 2020

ghhyhy

అవసరం అన్వేషణకు దారి తీస్తుంది. కరోనా వైరస్ వల్ల కొత్త కొత్త పరికరాలను కనిపెడుతున్నాయి. కరోనాను గుర్తించగానే వెలిగే ఫ్లోరోసెంట్ మాస్కులు, నిత్యావసర సామగ్రిపై కరోనా వైరస్‌ను చంపే ఆల్ట్రావయొలెట్ డబ్బాలు ఎన్నో తయారవుతున్నాయి. కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా ఫర్నీచర్ కూడా తీసుకొచ్చింది ప్రముఖ సంస్థ నీల్ కమల్. 

కరోనా పేషంట్లకు పూర్తి రక్షణ ఇందులో ఉంటుందని కంపెనీ ప్రతినిధి అజయ్ అగర్వాల్ చెప్పారు. క్వారంటైన్ బెడ్, ఐసొలేషన్ బెండ్, వైరస్ గార్డ్, ట్రావెల్ గార్డ్ లనున తయారు చేశామని, ఇవి అటు పేషంట్లకు, ఇటు వైద్యసిబ్బంది యూజర్ ప్రెండ్లీగా ఉంటాయని తెలిపింది. మంచాన్ని కేవలం మూడే నిమిషాల్లో ‘కరోనా మంచం’ వాడుకునే వీలుందన్నారు. చేతులు కడుక్కోడానికి కూడా ప్రత్యేక పరికరం తయారు చేశామన్నారు. పెద్ద సంఖ్యలో జనం భోంచేయడానికి భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక కుర్చీలను కూడా రూపొందించామన్నారు. ముంబై మునిసిపల్ ఆస్పత్రుల కోసం వెయ్యి మంచాలను, ఇతర ఫర్నీచర్‌ను సరఫరా చేశామని వెల్లడించారు.