Neerjarani smuggled gold from Dubai to vijayawada
mictv telugu

దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్.. పట్టుబడిన ఏపీ ఉన్నతాధికారి భార్య

September 10, 2022

దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా రవాణా చేసిన ఏపీకి చెందిన ఉన్నతాధికారి భార్యను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. షార్జా నుంచి 38 మంది ప్రయాణీకులతో ఓ విమానం గురువారం సాయంత్రం విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది. అందులో ఓ మహిళ కిలో బంగారంతో వస్తుందని సమాచారం అందగా, అధికారులు హైద్రాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. అనంతరం షార్జా నుంచి వచ్చిన ప్రయాణీకులను చెక్ చేయగా, మహిళ వద్ద కిలో బంగారు ఆభరణాలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా, ఆమె ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక, సాంస్కృతిక సమితి సీఈఓ రేగుళ్ల మల్లికార్జున రావు భార్య నీరజా రాణిగా తేలింది. నీరజారాణి దుబాయ్‌లో జ్యువెలర్స్ షాపు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.