నీట్ పీజీ 2023ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష నీటీ పీజీ 2023 కోసం రిజిస్ట్రేషన్ ఇవాళ్టితో ముగినుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ natboard.edu.inలో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు తెలిపింది. నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 4250 చెల్లించడం ద్వారా నీట్ పీజీ రిజిస్ట్రేషన్ 2023ని పూర్తి చేస్తారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల వంటి వివిధ రిజర్వ్‌డ్ కేటగిరీలకు పరీక్ష ఫీజు రూ.3250 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
నీట్ పీజీ కోసం అర్హత.
నీట్ పీజీ రిజిస్ట్రేషన్ 2023 కోసం NBEMS వెబ్‌సైట్‌కు వెళ్లి, సమాచార బులెటిన్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిలో ఇవ్వబడిన అర్హతలను ఒకసారి చెక్ చేయాలి. ఈ బులెటిన్ ప్రకారం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తించబడిన వైద్య విద్యా సంస్థ నుండి MBBS డిగ్రీని పొందిన అభ్యర్థులు మాత్రమే NEET PG 2023 రిజిస్ట్రేషన్‌కు అర్హులు. మే 31, 2023 నాటికి నిర్దేశిత ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తారు. NEET PG 2023 ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో PG స్థాయి డిగ్రీ, డిప్లొమా కోర్సులకు అభ్యర్థులు సెలక్ట్ అవుతారు.
అభ్యర్థులు NEET PG రిజిస్ట్రేషన్ 2023ని పూర్తి చేసిన తర్వాత, వారి దరఖాస్తులో ఏదైనా సమస్య ఉన్నట్లయితే అధికారిక వెబ్ సైట్ ద్వారా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దిద్దుబాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 5వ తేదీన నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు NBEMS ప్రకటించింది. దీనికోసం ఫిబ్రవరి 27 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.