ఆర్‌బీఐ శుభవార్త.. ఇక నెఫ్ట్ చార్జీలు ఉండవు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్‌బీఐ శుభవార్త.. ఇక నెఫ్ట్ చార్జీలు ఉండవు

November 8, 2019

డిజిటల్ లావాదేవీల పెంపు కోసం ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసింది. ప్రోత్సాహకాలు, చార్జీల రద్దు వంటి అనేక మార్గాల్లో ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తోంది. పెద్ద నోట్ల రద్దకు మూడేళ్లు పూర్తైన రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సేవింగ్ ఖాతాల వినియోగదారులు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) ద్వారా జరిపే లావాదేవీలపై చార్జీలను ఆర్‌బీఐ రద్దు చేసింది. ఈమేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. 2020 జనవరి నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని, డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. 

Neft charges removed ...

 

అలాగే పార్కింగ్‌ ఫీజు, పెట్రోల్‌ బంకుల చెల్లింపుల కోసం ఫాస్టాగ్స్‌ను అనుమతించాలని కోరింది. డిజిటల్ సదుపాయాలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మనదేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. 2018 అక్టోబర్‌-2019 సెప్టెంబర్‌ మధ్య 96 శాతం పెరగ్గా, నెఫ్ట్‌ లావాదేవీలు 20 శాతం, యూపీఐ పేమెంట్స్‌ 263 శాతం పెరిగాయి.