Negligence of education department.. Rs. 4959 crores of central funds was wasted
mictv telugu

విద్యాశాఖ అలసత్వం.. రూ. 4959 కోట్ల కేంద్ర నిధులు వృథా

July 15, 2022

తెలంగాణ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. గడచిన ఎనిమిదేళ్లలో సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద కేంద్రం మంజూరు చేసిన రూ. 4959 కోట్లు వినియోగంలోకి రాకుండా వృథా అయ్యాయి. ఈ విషయాన్ని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆర్టీఐ వద్ద సేకరించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ పథకం కింద అక్షరాస్యతను పెంచడం, విద్యకు దూరంగా ఉన్న పిల్లలను బడిలో చేర్పించడం వంటి పనులు చేయాల్సి ఉంది. దీనికి కేంద్రం 60 శాతం నిధులివ్వగా, రాష్ట్రం తన వాటాగా 40 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్రం తన వంతు నిధులు ఇవ్వకపోతే, కేంద్రం నిధులు అలాగే వృథా అవుతాయి. 2017-18 నుంచి 2020-21 వరకు కేంద్రం తన వంతు వాటాగా రూ. 9398 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్రం కేవలం రూ. 4439 కోట్లను మాత్రమే ఉపయోగించగలిగింది. అంటే మిగిలిపోయిన నిధులు రూ. 4959 కోట్లు ఉన్నాయి. శాతాల్లో చూస్తే 47 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఈ విషయాన్ని ఆకునూరి మురళి ఎత్తిచూపుతూ అధికారుల తీరును ఎండగట్టారు.