జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయిన కిర్రాక్ ఆర్పీ నెల రోజుల క్రితం కూకట్ పల్లిలో చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోవడం, జనాల తాకిడితో విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడడంతో నెల రోజులకే మూసేశాడు. తర్వాత నెల్లూరు వెళ్లి అక్కడ చెఫ్ పోటీలు పెట్టి రుచికరంగా వండిన మహిళలను హైర్ చేసుకున్నాడు. తాజాగా డప్పు చప్పుళ్ల మధ్య నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ని తిరిగి ప్రారంభించాడు కిర్రాక్ ఆర్పీ. వంట కోసం తీసుకొచ్చిన మహిళలకు తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చాడు. వీరు ఉదయం నాలుగు గంటలకే వంట మొదలు పెడతారని, నాలుగు గంటల్లో వంట పూర్తవుతుందని ఆర్పీ వెల్లడించాడు. మళ్లీ ప్రారంభించిన కర్రీ పాయింట్ కి జనాలు ఇప్పుడు కూడా పోటెత్తుతున్నారని ఆనందం వ్యక్తం చేశాడు. మరి ఈ సారైనా కస్టమర్ల సంఖ్యకు తగ్గట్టు సకాలంలో డెలివరీ చేస్తాడో లేదో చూడాలి మరి.