ఏపీ రాజకీయాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యహారం డైలీ ఎపిసోడ్ గా మారింది. ఆయన వైసీపీకి దూరం జరగడం.. టీడీపీ దగ్గరవ్వడం, ఫోన్ ట్యాపింగ్, ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు, కోటం రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కోటం రెడ్డికి బెదరింపు కాల్స్ సైతం వస్తున్నాయి. తాజగా వైసీపీ సానుభూతి పరుడు కడపకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ కోటంరెడ్డిని ఫోన్‌లో బెదిరించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కోటం రెడ్డికి ఫోన్ చేసిన బోరుగడ్డ అనిల్ మొదట ఎందుకన్నా ఇలా చేశావు ..అని మొదలు పెట్టి తర్వాత బూతుల దండకం అందుకున్నాడు. వైసీపీ నుంచి వెళ్ళితే..వెళ్లిపో కానీ..సీఎం జగన్, వైఎస్ జోలికి వస్తే నెల్లూరు సెంటర్‌లో బండికి కట్టి ఈడ్చుకెళ్తామంటూ కోటంరెడ్డిని బెదిరించాడు. కోటం రెడ్డితో పాటు అతడి తమ్ముడికి కూడా వార్నింగ్ ఇచ్చాడు.జగన్ తో పాటు సజ్జల వంటి పార్టీ పెద్దల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని పరుష పదజాలంతో హెచ్చరించాడు. తాజాగా విడుదలైన బోరగడ్డ అనిల్ – కోటంరెడ్డి ఫోన్ కాల్ ఆడియో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.అయితే జగన్, వైఎస్‌ను ఏమనకుండానే అనిల్ బెదిరించాడని కోటం రెడ్డి వాపోతున్నారు.
గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి, టీడీపీ నాయకులు, పవన్ కల్యాణ్‌లను దూషించాడు.సీఎం జగన్ ఆర్డర్ ఇస్తే.. చంద్రబాబు, నారా లోకేష్‌ను చంపేస్తానని అప్పట్లో సంచలన వ్యాఖ్యల చేశారు. అదేవిధంగా “వైజాగ్ వస్తున్నావ్ కదా.. రా నా కొ.. రా.. నీ సంగతి అక్కడే తేల్చకపోతే నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. వెయిటింగ్.. రా చూసుకుందాం. నీ ఫ్యాన్స్ వస్తారా..? ఎవరైనా ఫ్యాన్స్ వస్తారా..? అంటూ పవన్‌పై రెచ్చిపోయాడు. పవన్ భార్య, పిల్లలపై అసభ్య పదజాలాన్ని వాడాడు.