వైసీపీ ఎమ్మెల్యే కారు నుజ్జునుజ్జు..  - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యే కారు నుజ్జునుజ్జు.. 

September 30, 2020

Nellore rural mla Sridhar reddy car

నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్‌ రెడ్డి కారు ఘోర ప్రమాదానికి గురైంది. అందులో ఆయన లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. డ్రైవర్‌ కూడా సురక్షితంగా బయపడ్డాడు. దీంతో వైకాపా శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. 

ఈ రోజు ఉదయం తెట్టు జంక్షన్‌ దగ్గర శ్రీధర్ రెడ్డికారు  లారీని ఢీ కొట్టింది. అందులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం గుర్తుపట్టలేని విధంగా నుజ్జునుజ్జయింది. డ్రైవర్ ఎయిర్ బెలూన్ల సాయంతో బయటపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కారు ఢీకొట్టిన వాహనం అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి శ్రీధర్ రెడ్డి ఆరా తీశారు. ఆయనకు ఆరోగ్య బాగాలేకపోవడంతో ఇంట్లోనే ఉన్నారని, డ్రైవర్‌ను ఏదో పనిపై విజయవాడ పంపించారని సమాచారం.