రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాట పాతదే. అవసరాన్ని బట్టి పార్టీలు మారకపోతే మూర్ఖుడిగా జమకట్టే రాజకీయ కలికాలం ఇదే. అబ్బే అలాంటిదేమీ లేదు అని పబ్లిగ్గా కొట్టొపారేసే నేతలు వారం తిరక్కముందే ఎగస్పార్టీ కండువా కప్పుకోవడం చాలానే చూసే ఉన్నాం. ఇక విషయానికి వస్తే ఏమైందో ఏమో తెలియదుగాని వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి జంప్ చేస్తున్నట్లు చెప్పే ఆడియో ఒకటి బయటికి వచ్చేసింది. తనను వేధిస్తున్నారంటూ వైసీపీ అధిష్ఠానంపై అప్పడప్పుడూ అసంతృప్తి వెళ్లగక్కుతున్న శ్రీధర్.. తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తన అనుచరులతో చెప్పినట్లు ఈ ఆడియోలో ఉంది.
వైరల్ అవుతున్న ఆడియోలోని వివరాల ప్రకారం శ్రీధర్ రెడ్డి ఏమన్నారంటే.. ‘‘నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు. దీనికి ఆధారాలను బయటపెడితే ఇద్దరు ఐపీఎస్‌ల ఉద్యోగాలు ఊడిపోతాయి. వైసీపీ ప్రభుత్వం షేక్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుంది. ప్రజల మేలు కోసమే నేను పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడాను. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తాను. అయితే 2023 డిసెంబర్ వరకు పార్టీ మారను. జగన్ నాకు రెండుసార్లు టికెట్ ఇచ్చారన్న గౌరవం ఉంది’ అని శ్రీధర్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి :
కోడికత్తి కేసులో జగన్ కూడా కోర్టుకు..