కరోనా నయమైందని రోడ్డెక్కాడు.. ఉలిక్కిపడ్డ నెల్లూరు పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా నయమైందని రోడ్డెక్కాడు.. ఉలిక్కిపడ్డ నెల్లూరు పోలీసులు

March 25, 2020

Nellore

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు అతనిదే. ఇటలీ నుంచి స్వస్థలమైన నెల్లూరుకు వచ్చిన అతనికి మొదట కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. కానీ కొన్నాళ్లకే దాని లక్షణాలు కనిపించారు. మళ్లీ పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. అధికారులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కోలుకున్న తర్వాత కూడా రెండుసార్లు పరీక్షించారు. రెండుసార్లూ నెగిటివ్ రావడంతో ఇంటికి పంపారు. 

కరోనా నయమైంది కదా, ఇక నేను ఎంచక్కా జామ్మని బయట తిరగొచ్చంటూ మంగళవారం బైక్ పై బయటికొచ్చాడు. అసలే లాక్‌డౌన్ కదా. పోలీసులు అడ్డుకున్నారు. తప్పయిపోయిందని ఇంటికి వెళ్లి ఉంటే సరిపోయేది. కానీ అతడు ధైర్యంగా ‘నాకు కరోనా వచ్చింది. పోయింది. కావాలంటే ఈ టెస్ట్ కాగితాలు చూస్కోండి’ అన్నాడు. అంతే. పోలీసులకు మొదట నోటమాటరాలేదు. తర్వాత తేరుకుని తమదైన శైలిలో మందలించారు. అతనికి చికిత్స అందించిన డాక్టర్లతో మాట్లాడి అతణ్ని మర్యాదగా ఇంటికి తోలేశారు.