సోషల్ మీడియాలో నెల్లూరు యువకుడి ట్రెండ్.. మహేశ్ బాబు ఫైట్ అదరగొట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

సోషల్ మీడియాలో నెల్లూరు యువకుడి ట్రెండ్.. మహేశ్ బాబు ఫైట్ అదరగొట్టాడు

August 11, 2020

Nellore Youth Spoof Mahesh Babu Movie

టాలెంట్ ఎవరి సొంతం కాదు అనేదానికి మరోసారి అర్థం దొరికింది. మట్టిలో మాణిక్యాల్లా కొంత మంది కుర్రాలు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ సీన్ తీసి అదరగొట్టాడు. చిన్న పిల్లలతో కలిసి సినిమాను తలపించేలా క్రియేట్ చేసి బర్త్‌డే గిఫ్ట్‌గా విసెష్ చెప్పాడు. రాత్రికి రాత్రే ఇది వైరల్ కావడంతో ఇప్పుడు ఆ నెల్లూరు కుర్రాళ్లు సెలబ్రెటీలు అయిపోయారు. వారి టాలెంట్ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. 

మీనంగారి కిరణ్ (19) చేసిన ఈ వీడియో సంచలనం క్రియేట్ చేసింది. తన సమీపంలోని చిన్నారులతో కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ఫైట్ సీన్ రీ క్రియేట్ చేశాడు. సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా డైలాగులు, ఫైట్ సీన్, యాక్షన్ అన్నింటిని మేలవించాడు. ఏ మాత్రం టెక్నాలజీని వాడకుండా సొంత తెలివితో ఈ పని చేయడంతో  దర్శకుడు అనిల్ రావిపూడి మురిసిపోయాడు. ఆయన దీన్ని రీ ట్వీట్ చేయడంతో  వైరల్ అయింది. అంతే  కాదు రమణా లోడెత్తరా అనే ఫైట్ సీన్ కూడా తీశాడు. దీంతో అతడు ఎవరూ, బ్యాగ్రౌండ్ ఏంటి అని అంతా తెగ వెతికేస్తుండగా ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. 

ఏ మాత్రం సపోర్ట్ లేకుండా క్రియేటివిటినీ నమ్ముకున్నాడు కిరణ్. 9వ తరగతి వరకు మాత్రమే చదివినా కూడా తనలోని టాలెంట్‌కు కొదవ లేదని నిరూపించాడు. కాగా కిరణ్ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఉంటున్నాడు. ఓ పెంకుల తయారీ పరిశ్రమలో పని చేస్తూనే.. తల్లితో పాటు చేపలు పట్టే వృత్తి  కొనసాగిస్తున్నాడు. పేదరికాన్ని అదిగమించి తన సత్తా చాటాడు. కాగా అంతకు ముందు ‘సర్కార్’, ‘కాటమరాయుడు’ , వంటి సినిమా ఫైట్స్ కూడా తీశానని చెప్పాడు. కానీ ఈ ఫైట్ సీన్‌తో అతనికి మంచి గుర్తింపు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 

Sarileru neekevvaru spoof by children you will love it

Publiée par Spoofz sur Lundi 10 août 2020