చైనా వైరస్ కంటే భారత వైరస్సే యమడేంజర్..నేపాల్ ప్రేలాపన - MicTv.in - Telugu News
mictv telugu

చైనా వైరస్ కంటే భారత వైరస్సే యమడేంజర్..నేపాల్ ప్రేలాపన

May 20, 2020

Indian.

నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలి భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేపాల్ లో కరోనా వైరస్ వ్యాప్తికి భారత్‌ను తప్పుబట్టారు. భారత్ నుంచి వస్తోన్న వైరస్.. చైనా, ఇటలీ వైరస్‌ల కంటే ప్రమాదకరంగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరిగా టెస్టులు చేయకుండానే భారత్ నుంచి జనాలను తీసుకొస్తున్నారని అన్నారు. దీనికి కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులే బాధ్యత వహించాలని పార్లమెంట్‌లో ఆయన అన్నారు. అక్రమ మార్గాల ద్వారా భారత్ నుంచి వస్తోన్న వారు.. తమ దేశంలో కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ఓలీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్ ప్రాంతాలను తిరిగి భారత్ నుంచి స్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు. 1816లో బ్రిటిష్ పాలకులతో కూడిన సుగౌలీ ఒప్పందం మేరకు లిపులేఖ్ ప్రాంతం తమదేనని నేపాల్ వాదిస్తోంది. 1962లో చైనాతో యుద్ధం జరిగిన నాటి నుంచి వ్యూహాత్మక కాలాపానీ, లింపియాధుర ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించి ఉంటుండగా.. ఈ ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తోంది.