నేపాల్ కబ్జా మ్యాప్‌కు సొంత దేశంలో ఎదురుదెబ్బ - Telugu News - Mic tv
mictv telugu

నేపాల్ కబ్జా మ్యాప్‌కు సొంత దేశంలో ఎదురుదెబ్బ

May 27, 2020

Nepal

భారత్ భూభాగాలైన లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగంగా చూపుతూ నేపాల్‌ రూపొందించిన కొత్త మ్యాప్‌కు స్వదేశంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌ సభ్యుల అంగీకారం పొందడంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. దీంతో రాజ్యాంగ సవరణ ప్రక్రియ వాయిదా పడింది. ఇందుకోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు నేపాల్‌లోని వివిధ పార్టీల ఏకాభిప్రాయ సేకరణలో ప్రధాని కేపీ శర్మ విఫలమయ్యారు.

గోర్ఖా జాతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని ప్రధాని చూస్తున్నారని, ఇందులో ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది ఆరోపిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన నేపాల్‌ కాంగ్రెస్‌ తన వైఖరిని కేంద్ర వర్కింగ్‌ కమిటీలో చర్చించాకే చెబుతామని తెలిపింది. దీంతో రాజ్యాంగ సవరణ వాయిదా పడింది. నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చారిత్రాత్మకత ఆధారాలూ లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత్‌ ఇప్పటికే స్పష్టంచేసింది.