వైద్యం చెయ్యకుండా ఎందుకు గెంటేశారు ? - MicTv.in - Telugu News
mictv telugu

వైద్యం చెయ్యకుండా ఎందుకు గెంటేశారు ?

September 8, 2017

అర్ధరాత్రి ఎందుకింత అమానుషం ? చికిత్స చేయించే బాధ్యత మాది అని తీసుకచ్చి రాత్రికి రాత్రే పేషెంట్లను ఎందుకు గెంటేశారు? నేరేళ్ల ఘటనలో ఇప్పటికే బద్నాం అయిన ప్రభుత్వం, నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితుల పట్ల ఎందుకిలా ప్రవర్తిస్తుంది? వైద్యం చేయలేమని ఇక్కడినుంచి వెళ్లిపోండి అని డాక్టర్లు ఎందుకు చెప్పారు? నిమ్స్ డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నదెవరు?

సిరిసిల్లా జిల్లా నేరేళ్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నవారిని అడ్డుకున్న కొందరిని పోలీసులు చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. అందులో ఇద్దరు ముగ్గురు దళిత యువకులు ఉండడంతో ఇష్యూ చిలికి చిలికి గాలివానైనట్టు ఇంకా పెద్దదైంది. పోలీసులు చిత్రహింసల్లో గాయపడ్డ వారిని మొదట వేములవాడలో ఉన్న ఓ దవాఖానాలో చికిత్స అందించిన ప్రభుత్వం. అక్కడ సదుపాయాలు సరిగ్గా లేవంటూ హైద్రాబాద్ లోని నిమ్స్ కు బాధితులను తీసుకొచ్చారు. కానీ ఏమైందో తెలీదు నిన్న అర్ధరాత్రి  కొందరు పోలీసోళ్లు మరియు  కొందరు సివిల్ డ్రెస్ లో వచ్చి..మీకు ట్రీట్ మెంట్ అవుసరం లేదు, వెంటనే డిచార్జ్ కావాలంటూ బాధితులపై ఒత్తిడి తెచ్చారు. వాళ్లు మాకు చికిత్స ఇంకా పూర్తికాలేదు అని చెప్పినా వినలేదు. బలవంతంగా నిమ్స్ నుంచి గెంటేశారు. డాక్టర్లు కూడా మాకు పైనుంచి ఒత్తిడి వస్తుంది, మీరు వేరే దవాఖాన్లలో చూపిచ్చుకోండి కానీ మాదగ్గరనైతే, మేం ట్రీట్ మెంట్ చెయ్యలేం అని  బాధితులకు గట్టిగా చెప్పారు. వెంటనే బాధితులు,కుటుంబ సభ్యులతో వైద్యం ఎందుకు చెయ్యరు అని నిమ్స్ ముందు ధర్నాకు దిగారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కొందరు బిజేపి నేతలు ,కాంగ్రెస్ నేతలు కలిసి  నేరేళ్ల బాధితులను కేర్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రభుత్వం నేరేళ్ల బాధితులపై ఎందుకింత అమానుషంగా ప్రవర్తిస్తుంది అని పలువురు నేతలు మండి పడుతున్నారు. దీనిపై టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలె మరి.