మేం కొట్టలేదు.. అవి పాత దెబ్బలే ! - MicTv.in - Telugu News
mictv telugu

మేం కొట్టలేదు.. అవి పాత దెబ్బలే !

August 9, 2017

నేరెళ్ళ సంఘటన గురించి నవ్వాలో, ఏడవాలో తెలియని ఒక వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే పోలీసులు వాళ్ళను కొట్టలేదట, టచ్ కూడా చెయ్యలేదట, ఒట్టు, వాళ్ళవి గతం లో తాకిన దెబ్బలు మాత్రమే.., అని కోర్ట్ కు నివేదిక ఇచ్చింది ప్రభుత్వం. ఇది చిత్రంగా లేదూ ? నిందితులు పాత గాయాలతో బాధపడుతున్నారా ? ఎప్పుడో తగిలిన దెబ్బలు ఒక్కరికి కాకుండా అందరికీ ఒకేసారి తిరగదోడుతున్నాయా ?

వారెవ్వా.. వింటూ ఊ కొట్టాలే గానీ తిమ్మిని బమ్మి చేసి నమ్మిస్తారేమో అని నేరెళ్ళ బాధితులు తల బాదుకుంటూ కుమిలిపోతున్నారు ? న్యాయం ఎక్కడ జరుగుతుందని బాధ పడుతున్నారు ?

వాళ్ల బాధను అర్థం చేస్కున్న కోర్టు కరీంనగర్ లోని MGM వైద్యులతో వాళ్ళకు టెస్టులు చెయ్యాలని ఆదేశించింది. పోలీసుల దెబ్బలతో 3rd డిగ్రీ గాయాలతో ఉన్నారో తేల్చాలని కమిటీ వేసింది కోర్ట్. వచ్చేవారం లో నివేదిక ఇవ్వాలని ఆదేశం కూడా జారీ చేసింది. ఆ నివేదికలు వచ్చేసరికి వాళ్ళ ఒంటి మీదున్న గాయాలు చల్లగా నయమౌతుండొచ్చునేమో. ఈ రోజుల్లో మనుషుల్ని చంపి వాళ్ళను వాళ్ళే పొడుచుకు చచ్చారని నమ్మించినా ఆశ్చర్యపోనక్ఖర్లేదు. ఇదంతా చూస్తుంటే వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారా ? లేకపోతే బీరు సీసాలతో తలలు పగలగొట్టుకున్నారా ? రోకలి బండ్లతో ఒకర్నొకరు బాదుకున్నారా ? ఇత్యాది అనుమానాలు నింపుకున్నారిప్పుడు నేరెళ్ళ, వేములవాడ జనాలు. చూడాలి మరి ఎంజిఎమ్ నివేదికలు వచ్చాక కోర్టు ఏం తీర్పు ఇస్తుందో ??