Netaji's great granddaughter Rajashree Choudhury Bose was detained by the police
mictv telugu

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవరాలిని నిర్బంధించిన పోలీసులు

August 9, 2022

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సమీపంలో పూజలు చేసేందుకు వెళుతున్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ముని మనవరాలు రాజ్యశ్రీ చౌధరీని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధ్యక్షురాలైన రాజ్యశ్రీ గత సోమవారం ఓ ప్రకటన చేస్తూ.. జ్ఞానవాపి మసీదు వద్ద జలాభిషేకం చేస్తానని ప్రకటించారు. అయితే జలాభిషేకానికి ఆమెను అనుమతించేది లేదని స్థానిక అధికారులు తేల్చి చెప్పారు.

మరోవైపు, జ్ఞానవాపి మసీదులో జలాభిషేకం నిర్వహించేందుకు రాజ్యశ్రీ నిన్న రైలులో వారణాసి బయలుదేరారు. విషయం తెలిసిన పోలీసులు ప్రయాగ్‌రాజ్ రైల్వేస్టేషన్‌లో ఆమెను అడ్డుకుని కిందికి దించారు. అనంతరం నిర్బంధంలోకి తీసుకున్నారు.