ఎదుటి వాళ్లను బుట్టలో వేయడం అంటే ఎందో…. ఇజ్రాయిల్ పెద్ద మనిషిని చూస్తే టక్కున చెప్పొచ్చు. మన ప్రధాని మోదీ అక్కడ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మోదీని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన పలుకని పలుకు లేదు.. చేయని మర్యాదా లేదు. మూడు రోజుల పర్యటన కోసం వెళ్లిన మోదీకి ఘన స్వాగతం పలికారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహు. తినే తిండికాన్నుంచి… పండుకునే ఇంటి వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నరు. మీడియాతో మాట్లాడే టప్పుడు మోదీని ప్రశంసల జల్లుల ముంచేశారు.
ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీకి మంచి విందు ఏర్పాటు చేశారు నెతాన్యాహు. అది ఓ ఇండియన్ రెస్టారెంట్ లో. దాని యాజమాని పేరు రీనా పుష్కర్ణి. మోదీ వస్తున్నారు…. మంచి ఇండియన్ అదీ… ప్యూర్ వెజిటేబుల్ వంటలు చేయాలని చెప్పారు. చెప్పినట్లు గానే అద్భుత: అనే స్థాయిలో వంటలు అదరగొట్టారు రెస్టారెంట్ వాళ్లు. అక్కడా మోడీని ఫీదా చేశారు. అంతే కాదు 30 ఏండ్ల కింద తన భార్యతో కల్సి ఇక్కడే భోజనం చేశానని… ఇప్పుడు మోదీతో కల్సి భోజనం చేస్తుంటే మళ్లీ అదే ఫీల్ కలిగిందని చెప్పారు నెతాన్యాహు. మరి ఇంత కంటే ఏం కావాలి… ఎదుటి వారిని బుట్టలో కాదు… ఏకంగా గంప కింద కమ్మడానికి.
తొలి రోజు మోడీ ప్రపంచ నాయకుడు… మన దేశంలోనే అతి గొప్ప నాయకుడు… శక్తి వంతమైన నాయకుడు.. ఆయన రావడం మాకెంతో సంతోషం… ఇట్లా చానా చానా ఆయన చెప్పారు.. అక్కడి మీడియా మోడీని ఆకాశానికి అమాంతం ఎత్తేసింది. పొద్దున్నే యోగాసానాలు మోదీతో కల్సి వేస్తుంటే… మెడలు ఇటు వైపు తిప్పితే నాకు ఇండియా కన్పిస్తే… మోడీ గారికి ఇజ్రాయిల్ కన్పిస్తుందని నెతాన్యాహు…. సెలవిచ్చారు. ప్రధాని మోదీ విదేశీ ఈ టూర్లలో ఇంతగనం ఎత్తేసిన నాయకులు మరెవ్వరూ లేరు కావొచ్చు. అన్నట్లు… అమెరికా అధ్యక్షలు ట్రంప్ దొర వారు కూడా మోడీని పొగడ్తల్ల ముంచారు. దాన్ని మించి పోయారు బెంజిమిన్ నెతాన్యాహు గారు. యోగా ఆసానాలు వేయించి, కౌగిలించుకుని అందర్నీ మోడీ బుట్టలో వేసుకుంటే… మోడీనే బుట్టలో వేసుకున్నారు నెతాన్యాహు.