కోలుకోలేని పిల్లల్ని చంపేసుకోవచ్చు.. - MicTv.in - Telugu News
mictv telugu

కోలుకోలేని పిల్లల్ని చంపేసుకోవచ్చు..

October 19, 2020

Netherlands Children End Lives of Act  .jp

జబ్బు చేస్తే నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వెళతారు. అది నయం కాకపోయినా కుటుంబ సభ్యులు సపర్యలు చేస్తూ.. ప్రాణం పోస్తూ ఉంటారు. కానీ నెదర్లాండ్స్ ప్రభుత్వం మాత్రం ఓ వింత నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఏ దేశం చేయనటువంటి సాహసం చేసింది. దీర్ఘ కాలం వ్యాధితో బాధపడుతున్నవారు, నయం చేయలేని రోగం ఉన్న 12 ఏళ్లలోపు చిన్నారులను నిర్ధాక్షిణ్యంగా చంపేయవచ్చనే చట్టం తీసుకువచ్చారు. డచ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం కొత్త చర్చకు దారితీసింది. జబ్బు నయం కాకపోతే చంపేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

ఏ మాత్రం తగ్గని జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యుల సాయంతో స్వాంతన మార్గంలో ముగించేందుకు వీలు కల్పించారు. అయితే, దీని కోసం పిల్లల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేశారు. గతంలోనే ఇలాంటి చట్టం ఉండేది. కానీ ఒక సంవత్సరం వరకు ఉన్న పిల్లలను చంపేందుకు అనుమతి ఇచ్చారు. కానీ ఇటీవల దీంట్లో సవరణ చేయాలని ఆరోగ్య మంత్రి హ్యూగో డీ జోంగ్ ప్రతిపాదించారు. దీన్ని ఏడాది నుంచి 12 సంవత్సరాల వయస్సు వరకు పెంచుతూ చట్టాన్ని ఆమోదించారు. కోలుకునే అవకాశం లేని వారు అనవసరంగా బాధపడుతున్నారని అందుకే వారికి ఇలా విముక్తి కల్పించాలని చట్టంలో పేర్కొన్నారు. నిపుణులు, ప్రజా ప్రతినిధులు కూడా దీనికి అంగీకారం తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.  

కాగా, నెదర్‌లాండ్స్‌లో ప్రతి ఏటా దీర్ఘకాలిక వ్యాధితో 5 నుంచి 10 మంది పిల్లలు భారంగా జీనం సాగిస్తున్నారు. అలాంటి బాధలను అనుభవించే  కంటే అతడి జీవితాన్ని అంతం చేయవచ్చని చట్టంలో పేర్కొన్నారు. యురోపియన్‌ యూనియన్‌ దేశాలైన లక్సెంబర్గ్, బెల్జియం, స్విట్జర్లాండ్‌ దేశాల్లో ఇలాంటి కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో   వైద్యుల సాయంతో వారికి మరణాన్ని ప్రసాదిస్తున్నారు. లక్సెంబర్గ్‌లో మాత్రం పెద్ద వయసు వారికి మాత్రమే అనుమతి ఇచ్చేలా చట్టాలు ఉన్నాయి. కానీ నెదర్‌లాండ్స్‌లో మాత్రం 12 ఏళ్లలోపు పిల్లలను చంపుకునే అవకాశం కల్పించడం విశేషం. చిన్న దేశాలు కాబట్టి ఇలా చేయడం వల్ల ఇబ్బందులు రావడం లేదని, కానీ పెద్ద దేశాల్లో మాత్రం ఇది ఏ మాత్రం అంగీకరించే అవకాశం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.