Netherlands physiotherapist who made the most expensive pillow
mictv telugu

అరకోటి దిండు.. నిద్రలేమితో బాధపడేవారికి వరం

June 24, 2022

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండును నెదర్లాండుకు చెందిన ఫిజియోథెరఫిస్ట్ తయారు చేశాడు. ఈ మధ్య బాగా ఎక్కువైన నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్తున్నారు. దీన్ని తయారు చేయడానికి 15 ఏళ్లు పట్టగా, ధర మాత్రం భారీగానే ఉంది. మన కరెన్సీలోనే రూ. 45 లక్షలు ఉంటుంది. అంత స్పెషల్ ఇందులో ఏముంది అనుకుంటున్నారా? ఈ దిండులో రోబోటిక్ మిల్లింగ్ మెషీన్ ద్వారా కాటన్ అమర్చారు. దిండుకు ఉండే జిప్పుకు నాలుగు వజ్రాలు పెట్టారు. ఓ నీలి రంగు రాయిని కూడా తగిలించడంతో అత్యంత ఖరీదైన దిండుగా నిలిచింది. దీని మీద తల వేసి పడుకున్న వారికి వెంటనే నిద్రపడుతుందని తయారుదారీ ఓ ప్రకటనలో తెలిపాడు. దాంతో ఈ పిల్లో సోషల్ మీడియాలో వైరల్ కాగా, కొందరు మాత్రం దిండు వేసుకుంటే నిద్ర వస్తుందో రాదో తెలియదు కానీ, దొంగల భయంతో అసలే నిద్ర పట్టదని కామెంట్ చేస్తున్నారు.