టీ20 వరల్డ్ కప్‌లోకి కొత్త టీం.. - MicTv.in - Telugu News
mictv telugu

టీ20 వరల్డ్ కప్‌లోకి కొత్త టీం..

October 30, 2019

క్రికెట్ అనగానే చాలా వరకు ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇలా కొన్ని జట్ల పేరు మాత్రమే వినిపిస్తుంది. గతంలో యూఏఈ బెర్ముడా లాంటి జట్లు క్రికెట్‌లోకి అడుగుపెట్టాయి. కానీ తమ ప్రదర్శనతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. టీ 20 వరల్డ్ కప్ అంటే మాత్రం ఇక టాప్ లెవల్‌లో ఉన్న దేశాలు మాత్రమే అడుతుంటాయి.  కానీ ఈసారి ఐసీసీ చిన్నదేశాలను కూడా ప్రోత్సహిస్తోంది. గత కొన్ని రోజులుగా టీ20లోకి అడుగుపెట్టాలని చూస్తున్న దేశాలకు ప్రోత్సాహకాలు ఇస్తూ వస్తోంది. 

T20 World Cup Cricket.

ఈ క్రమంలోనే ఈసారి టీ 20 వరల్డ్ కప్‌లోకి మరో కొత్త దేశం ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈసారి నెదర్లాండ్స్ తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోబోతోంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ కోసం నిర్వహించిన క్వాలీఫైయింగ్ మ్యాచ్‌లో యూఏఈపై విజయం సాధించిన కొత్త నెదర్లాండ్స్ ఈసారి అడుగుపెట్టబోతోంది. దీంతో గతంలో కంటే ఈసారి జట్ల సంఖ్య పెరుగుతోంది. మొత్తం మీద కొత్త జట్టు ఈసారి ఎలా తన ప్రదర్శన ఉండబోతోందనే ఇప్పుడు ఆసక్తిగా మారింది.