netherlands won by 13 runs vs southafrica
mictv telugu

వరల్డ్‌కప్‌లో మరో సంచలనం ..టోర్నీ నుంచి సౌతాఫ్రికా ఔట్

November 6, 2022

netherlands won by 13 runs vs southafrica

టీ 20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. సెమీస్‌కు పోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సఫారీలు చేతులెత్తేసారు. ఆల్‌రౌండ్‌ర్‌షో తో అదరగొట్టిన నెదర్లాండ్స్ 13 పరుగులతో విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోగా..జింబాబ్వే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియా సెమీస్‌కు చేరింది. ఇక దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో బంగ్లా-పాక్ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు సెమీస్‌కు చేరుతారు.

టాస్ ఓడి మ్యాచ్ బ్యాటింగ్‌కు వచ్చిన నెదర్లాండ్స్‌కు ఆ జట్టు ఓపెనర్లు మై బర్గ్(30 బంతుల్లో 37), మ్యాక్స్ ఓడ్వడ్(31 బంతుల్లో 21)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తర్వాత వచ్చిన టీ.కూపర్ (19 బంతుల్లో 35), అక్రమన్(26 బంతుల్లో 41 ) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

ఓ మోస్తరు లక్ష్యాన్ని చేధించడంలో దక్షిణాఫ్రికా చతికిలపడింది. నెదర్లాండ్స్ బౌలర్లు విజృంభించడంతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.రోసో (19 బంతుల్లో 25) తప్ప మిగతావారు పెద్దగా ఆడకపోవడంతో ఓటమి తప్పలేదు. క్రమం తప్పకుండా వరుస వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. చివరకు 20 ఓవర్లలో కేవలం 145 పరుగులు మాత్రమే చేసింది.నెదర్లాండ్స్ బౌలర్ గ్లోవర్ మూడు వికెట్లు తీయగా, క్లాసిన్, డీలిడే రెండేసీ, మీక్రేన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.