నీతో పిల్లల్ని కనాలని ఉంది’అంటూ నెటిజన్ కామెంట్.. సమంత ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

నీతో పిల్లల్ని కనాలని ఉంది’అంటూ నెటిజన్ కామెంట్.. సమంత ఫైర్

February 23, 2022

saam

టాలీవుడ్ యాక్టర్ సమంతను ఓ నెటిజన్ “నువ్వు పిల్లల్ని కన్నావా? నేను నీతో పిల్లల్ని కనాలనుకుంటున్నాను. (హ్యావ్ యూ రీప్రొడ్యూస్డ్, కాజ్ ఐ వాన్నా రొప్రొడ్యూస్ యూ)” అంటూ అడిగాడు. దీంతో సీరియస్ అయిన సమంత “ముందు ‘రీప్రొడ్యూస్’ను వాక్యంలో ఎలా వాడాలో తెలుసుకో. గూగుల్‌లో వెతుకు” అంటూ గట్టిగా బుద్ధి చెప్పింది.

మరోపక్క గతకొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, అభిమానులతో అన్ని విషయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమంత లైవ్ సెషన్‌ను నిర్వహించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుండగా, ఓ నెటిజన్ ఇదే అదనుగా తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అభ్యంతరకరమైన ప్రశ్నను సంధించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.