ఓటీటీలోకి కాంతార.. నెటిజన్ల ట్రోలింగ్ కి కారణం ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

ఓటీటీలోకి కాంతార.. నెటిజన్ల ట్రోలింగ్ కి కారణం ఇదే

November 24, 2022

చిన్న సినిమాగా కేవలం కన్నడలో రిలీజే భారీ విజయం సాధించిన కాంతార సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లను కొల్లగొట్టింది. కేవలం మౌత్ టాక్ తో పలు భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఓటీటీలో విడుదలపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. 50 రోజుల నిరీక్షణకు తెరదించుతూ గురువారం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. కానీ, తొలిరోజే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా క్లైమాక్స్ లో రిషభ్ షెట్టి నటనకు ప్రశంసలు రాగా, దానికి ప్రాణంలా నిలిచింది మాత్రం వరాహరూపం సాంగ్.

కానీ, ఓటీటీలో ఆ పాట లేదు. ఆ పాటపై కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కొత్త ట్యూన్ పెట్టారు. అది బాలేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. కొత్త ట్యూన్ నచ్చకపోవడంతో మూవీని ఎంజాయ్ చేయలేకపోయినట్టు ట్వీట్లు పెడుతున్నారు. కాగా, వరాహరూపం పాటపై మలయాళం మ్యూజిక్ బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జి కోర్టుకెక్కింది. ఆ పాటను తమ నవరస నుంచి కాపీ కొట్టారని చెప్పడంతో కోర్టు కాంతార యూనిట్ కి నోటీసులు జారీ చేసింది. నోటీసుల నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్ యూట్యూబ్ నుంచి ఆ పాటను తొలగించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా తీసేయడంతో ఆ ఫీల్ రావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.