ప్రశ్నించే జనాలకు సోషల్ మీడియా వేదిక అయిపోయింది. పరిష్కారం పక్కన పడితే తమకే సమస్య వచ్చినా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు నుండి తమకి ఎదురయ్యే అన్ని సమస్యలపై ట్విట్టర్ ద్వారా తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా ఒక యువకుడు నాగార్జునని కడిగిపారేసిన తీరు చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు మీ భార్య మధ్యతరగతి వాళ్ళని వేధిస్తుంది అంటూ ఘాటైన లెటర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతుంది. GHMC అధికారులు తమ ప్రాంతంలో వీధికుక్కలను డంపింగ్ చేయడంతో కలత చెందిన ఒక నెటిజన్ దీనిపై ఫిర్యాదు చేయగా.. కార్పొరేషన్ వెల్లడించిన విషయాలు ఆయనను కలవరానికి గురిచేశాయని అంటున్నాడు.
ట్విట్టర్లో సదురు నెటిజన్ మాట్లాడుతూ… “వ్యాక్సినేషన్ చేసిన వీధి కుక్కలని తిరిగి వీధుల్లో వదిలేయటంపై.. నా ఫిర్యాదుకి GHMC స్పందించింది. సుప్రీం కోర్టులో బ్లూ క్రాస్ నుండి అమల అక్కినేని ఫిర్యాదు కారణంగా తాము ఈ విషయంలో ఏమి చేయలేమని.. నివాసితుల ఫిర్యాదులకు తాము న్యాయం చేయలేమని కుక్కలని వదిలేసే ప్రైవేట్ కాంట్రాక్టర్ పేర్కొన్నాడు. దీనికంతటికి మీ భార్య అమలనే కారణం. మధ్యతరగతి వారిని అమల ఎందుకు వేధిస్తోంది? వీధి కుక్కలన్నింటినీ మీ ఇంటి ముందు పడేస్తే మీకు ఎలా ఉంటుంది నాగార్జున ?” అంటూ నెటిజన్ ట్విట్టర్ లో నాగార్జునకి ఘాటు లేఖని రాశాడు.
GHMC responded to my complaint on aggressive street dogs, pvt contractor claims he is helpless with residents complaints due to Amala Akkinneni complaint in SC. Why is your wife harassing middle class? Is it OK if all street dogs are dropped in front of your home? @iamnagarjuna
— Adarsh gult (@curryputtar) December 24, 2022
నిజానికి హైదరాబాద్ సహా అన్ని నగరాల్లో వీధి కుక్కల బెడద కొత్తేమీ కాదు. కొన్నిసార్లు వీధికుక్కలు పసికందులను పీక్కు తిన్న ఉదంతాలు… పాదచారుల పిక్కలని లాగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. మరి కుక్కలని చంపకూడదని కోర్టుల్లో కేసులు వేసిన బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని ఎప్పుడైనా కుక్కల బాధితులని పరామర్శించారా.. కుక్క కాట్లకు బలైన పెదాలకి ఎప్పుడైనా ఆర్థిక సహాయం చేశారా.. కుక్కలని హతమార్చే హక్కు మనుషులకి లేనప్పుడు.. ఆ కుక్కులని మీ ఇంటి ముందు ఎందుకు పెట్టడం లేదు. మధ్యతరగతి వారి వీధుల్లోనే ఎందుకు డంప్ చేస్తున్నారు అంటూ.. నెటిజన్ లెటర్ కి సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
రాత్రి చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా కన్నుమూశారు.. రవిబాబు
‘చలపతిరావు గారు మా కుటుంబ సభ్యుడు’- నందమూరి బాలకృష్ణ\
జూ.ఎన్టీఆర్ భావోద్వేగం..లే బాబాయ్ అంటూ… వీడియోకాల్ ద్వారా చలపతిరావును చివరిచూపులు
మారుతి సినిమాలో ప్రభాస్ లుక్ ఇదే… షూటింగ్ ఫోటో లీక్