netizens fire on Allu Arjun.. which he Shares Adorable Video Of His Daughter
mictv telugu

‘బన్నీ.. నీ తీరు మార్చుకో’… అల్లు అర్జున్‌పై నెటిజన్ల ఫైర్

November 22, 2022

తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన హీరో అల్లు అర్జున్ ఓ కాంట్రావర్సీలో చిక్కుకున్నాడు. సోమవారం కూతురు అర్హ పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఓ వీడియో షేర్‌ చేశాడు. తమ ఇంటి కింద ఫ్లోర్‌లో కందిరీగలున్నాయని, అవి కుడుతున్నాయనీ కంగారుపడుతూ.. అర్హ ముద్దు ముద్దుగా చెబుతున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఆ వీడియోలో ఓ ప్రాంతం గురించి అల్లు అర్జున్.. తన కూతురిని మందలించినట్లుగా ఉన్న ఓ మాట.. నెటిజన్ల విమర్శలకు కారణమైంది. ఆ వీడియోలో వారి సంభాషణ ఇలా ఉంది.

బన్నీ : ఏమున్నాయ్ అక్కడ..
అర్హ : కందిరీగలు వాళ్ల జుట్లోకి వెళ్తున్నాయ్..
బన్నీ : ఆ పుట్ట ఎక్కడుంది..
అర్హ : ఎక్కడుంది కిందుంది.. పొగపెట్టి..
బన్నీ : పొగపెట్టి ఏం చేశారు..
అర్హ : తీసినారు..
బన్నీ : ఏం తీసినారు.. మళ్లి తెలంగాణ..
అర్హ : అలా తీసి..
బన్నీ : ఎందుకు భయపడుతున్నావ్..
అర్హ : ఎందుకంటే అవి కుడుతున్నాయ్.. ఇన్ని ఉన్నాయ్.. చెట్టుకి కందిరీగలు..
బన్నీ : ఎక్కడుంది..
అర్హ : మన కింద ఉన్నాయ్.. ఇగో ఇక్కడే..

ఈ సంభాషణలో బన్నీ తన కూతురిని తెలంగాణ యాసలో మాట్లాడినందుకు గదమాయించినట్లుగా ఉండడంపై నెటిజన్లు తప్పు బడుతూ కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలోనే ఇల్లు, వ్యాపారాలు, స్టూడియోలు, ఆస్తులు.. చివరకు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తెలంగాణకు చెందినవారే అయుండీ.. తెలంగాణ యాస/భాష మాత్రం మాట్లాడకూడదా అంటూ మండిపడుతున్నారు. ఆ పాప తెలంగాణ భాషలో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నిస్తూ.. తప్పంతా మీ ఆలోచన విధానంలోనే ఉందని సూచిస్తున్నారు. తెలంగాణ భాష అంటే ఎందుకంతా చిన్నచూపు అని కామెంట్స్ చేస్తున్నారు.