Netizens Fire On Nontelugu Actors
mictv telugu

పరభాషా నటులపై ఫైరింగ్

November 16, 2022

సూపర్ స్టార్ కృష్ణకు పరభాషా నటులు సరైన నివాళి అర్పించలేదా? కడసారి చూపులు చూసేందుకు రాలేదా? కనీసం ట్విట్టర్ లోనైనా నివాళి పోస్టింగ్‌లు పెట్టలేదా? అవుననే అంటున్నారు నెటిజన్లు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోతే హైదరాబాద్ రావడానికి తీరిక లేదా అని మండిపడుతున్నారు. కమల్ హాసన్ , రజనీకాంత్ తప్ప మిగతావాళ్లెవరూ ఒక్క పోస్ట్ పెట్టలేదంటున్నారు.

ఏటా ఎన్నో డబ్బింగ్ సినిమాలు తెలుగులోకి వస్తున్నాయి. వీటి రిలీజ్‌కు ముందు ప్రయోషన్స్ హై లెవల్లో జరుగుతాయి. ఈవెంట్లలో పరభాషా నటులు డైలాగ్‌లు సినిమాల్ని మించి ఉంటాయి. అంతేకాదు తెలుగుభాష అంటే ఇష్టం, తెలుగు ప్రజల ప్రేమను ఎప్పటికీ మరువలేమని కబర్లు చెబుతారు. హైదరాబాద్ బిర్యానీ అంటే తెగ ఇష్టమని కోతలు కోస్తారు. చాలా డబ్బింగ్ సినిమాలు ఇక్కడ విజయవంతమయ్యాయి. పరభాషా నటుల్ని ప్రేక్షకులు ఆదరించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

కానీ తెలుగు హీరోలు చనిపోతే సరిగ్గా పట్టించుకోవడం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కృష్ణకు నివాళి అర్పించే సమయం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ట్వీట్టర్‌లో సంతాపం ప్రకటించడానికి ఏమైందంటున్నారు. కమల్ హాసన్ , రజనీకాంత్ తప్ప మిగతావారెవ్వరూ కృష్ణకు నివాళి అర్పించలేదంటున్నారు. సినీ ప్రమోషన్లపై ధ్యాస వీటిపై లేదా అని నిలదీస్తున్నారు.పరభాషా నటుల్లో ఎక్కడ మానవత్వం అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

గతంలో పరభాషా నటులు చనిపోయినప్పుడు చెన్నై,ముంబై వెళ్లి తెలుగు నటులు నివాళులు అర్పించారు. వీలుకాకపోతే ట్విట్టర్‌లో పోస్టింగులు పెట్టారు. ఈ విషయాల్ని ఇప్పుడు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పరభాషా నటులపై ఫైర్ అవుతున్నారు.