యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఫుల్ లెన్త్ సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ అంశాలతో సినీ అభిమానులను బీభత్సంగా ఆకట్టుకున్న ఈ సినిమా.. అందులో రాధిక రోల్‌లో నటించిన హీరోయిన్ నేహశెట్టికి కూడా మంచి పేరునే తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్‌తో రాధికా.. రాధికా.. అంటూ వరుస ఆఫర్లు తన ముందు క్యూ కడతాయని ఈ అమ్మడు భావించింది.
స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఈ భామ సైన్ చేయడం ఖాయం అంటూ చాలా మంది విశ్వసించారు. అందుకు కారణం అల్లు అర్జున్‌తో చేసిన జోమాటో యాడ్. ఆ యాడ్ లో తప్ప నేహ శెట్టి మళ్లీ కనిపించలేదు. ఆ తర్వాత డీజే టిల్లు ఫేమ్‌తోనే హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. యూత్ ని అట్రాక్ట్ చేస్తోంది. అలా అయినా డైరెక్టర్ల పడితే మరో సినిమాలో ఛాన్స్ వస్తుందని.
స్టార్ హీరోల మాట అటుంచితే.. తాను చేసిన మూవీ డీజే టిల్లు పార్ట్ 2 లో కూడా ఛాన్స్ దక్కలేదు. హీరో సిద్ధూ మరో హీరోయిన్ల వెంట పడ్డాడు. కానీ కుర్రకారు తెగ ప్రేమిస్తున్న ఈ రాధిక మాత్రం.. మరో మంచి సినిమాలో నటించే అవకాశం దక్కించుకోలేక పోయింది. కార్తీకేయ హీరో గా నటిస్తున్న బెదురులంక 2012 సినిమాలో ఈ అమ్మడు నటించింది. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. అది తప్ప ప్రస్తుతానికి ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయి అనేది టాక్. అవి అయినా ఫైనల్ అవుతాయా అనేది చూడాలి. రాధిక గా మంచి పాపులారిటీని దక్కించుకున్న నేహా శెట్టికి ఇలా ఆఫర్లు లేకపోవడం విడ్డూరంగా ఉందంటున్నారు నెటిజన్లు.