హార్దిక్ పాండ్యా శరీర రంగుపై ట్రోలింగ్..  - MicTv.in - Telugu News
mictv telugu

హార్దిక్ పాండ్యా శరీర రంగుపై ట్రోలింగ్.. 

January 2, 2020

rerwtwv

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా నిన్న తన ప్రియురాలు నటి నటాషా స్టాకోవిచ్‌తో నిశ్చితార్థం చేసుకోవడం తెలిసిందే. ఇన్నాళ్లకైనా తన ప్రేమ బయటపెట్టి ఒకంటివాడు కాబోతున్నాడని అభిమానులు హర్షం చేస్తున్నారు. హార్డిక్, నటాషా ఫోటోలను షేర్ చేస్తూ అభినందిస్తున్నారు. 

మరోపక్క.. వర్ణవివక్షకు మారుపేరైన మన దేశంలో అతని శరీర వర్ణంపై దారుణమైన ట్రోలింగ్ సాగుతోంది. ‘తెల్లని నటాషా ఎక్కడ నువ్వు ఎక్కడ? ఆమెకు ఎంత డబ్బిచ్చి ఒప్పించావు? మిమ్మల్ని చూస్తుంటే ఒకే ప్లేటులో అన్నం ముద్దను, తందూరీ చికెన్ ముక్కను పెట్టినట్టు ఉంది.. నువ్వు నల్లోడివి కదా, మన దేశ అమ్మాయిలు నీకు నచ్చలేదా? వాళ్లు నల్లగా ఉంటారనే కదా నువ్వు తెల్లతోలును ఎంచుకుంది?’ అని బీభత్సంగా కామెంట్లు చేస్తున్నారు. దారుణమైన ఫొటోలు పెట్టి పోల్చుతున్నారు. వీటిని పాండ్యా అభిమానులు దీటుగా తిప్పికొడుకున్నారు. వాళ్లిద్దరూ ఇష్టపడితే మీ గోల ఏంటి అని తిడుతున్నారు. ‘అతనికి దక్కింది మీకు దక్కలేదన్న అక్కసును రంగు పేరుతో తీర్చుకుంటున్నారు. మీ వద్ద డబ్బు ఉంటే మీరూ తెల్ల అమ్మాయిని కొనుక్కోండి.. పాండ్యాను విమర్శించి మన దేశ పరువు తియ్యండి.. ’ అని కోరుతున్నారు.