Netizens trolling actress Surekhavani about her video
mictv telugu

వీడియో : నీ కూతురిని కాదు.. నిన్ను పెళ్లి చేసుకుంటారు

May 30, 2022

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. ప్రస్తుతం తన కూతురు సుప్రితతో నివాసముంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి తన కూతురితో కలిసి వివిధ రకాల వీడియోలను తీసి అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా చేసిన వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

అందులో ఏముందంటే.. అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలోని తెలుసా తెలుసా అనే పాటకు లిప్ సింక్ చేస్తూ ఉయ్యాల ఊగుతున్న వీడియోను రూపొందించింది సురేఖ వాణి. అంతేకాక, అలవాటు ప్రకారం సోషల్ మీడియాలో వీడియోను ఉంచింది. దీంతో వీడియోలో సురేఖ వాణి క్యూట్‌నెస్ చూసిన నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ వయసులో అవసరమా ఆంటీ అని ఒకరు, ‘మేడమ్ మీ అమ్మాయి పెళ్లయ్యే దాకా ఇలాంటివి తగ్గించండి. లేదంటే మీ కూతురిని చూసుకోవడానికి వచ్చే మీ అల్లుడు మిమ్మల్ని చేసుకునే ప్రమాదం ఉంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో బ్యూటిఫుల్, నైస్ అంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.