రాణూ మోండాల్.. దెయ్యంలా ఈ మేకప్ ఏంటి తల్లీ?  - MicTv.in - Telugu News
mictv telugu

రాణూ మోండాల్.. దెయ్యంలా ఈ మేకప్ ఏంటి తల్లీ? 

November 17, 2019

ఒక్క పాట ఆమె జీవితాన్ని మార్చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వేస్టేషన్‌లో  పాటలు పాడుతూ బిచ్చమెత్త్తిన రాణు మండల్ ప్రస్తుతం సెలెబ్రిటీ అయిపోయారు. బాలీవుడ్ సీనియర్ గాయని లతా మంగేష్కర్ ఆలపించిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై..’ పాట తన జీవితాన్ని మార్చేసింది.

రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ ప్రయాణికుడు ఆమె పాడుతునప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆమె గానం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ ప్రముఖులెందరో ఆమె గాత్రానికి ఫిదా అయ్యారు. ఇంకే ఆమెకు అవకాశాలిస్తామంటూ ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేశ్ రేషమ్మియా తాను తెరకెక్కిస్తున్న సినిమాలో మొదటి పాట పాడే అవకాశం కల్పించారు. అప్పటినుంచి ఆమె పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సెలబ్రిటీ హోదా రావడంతో ఆమె అతి చేస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. ఇటీవల తనతో సెల్ఫీ కోరిన మహిళపై రాణూ విరుచుకుపడింది. తనిప్పుడు సెలబ్రిటీ అని గొప్పలు పోయింది. 

తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకోసం తన ముఖానికి ఎక్కువగా మేకప్ వేసుకున్నారు. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఎక్కువగా మేకప్ వేసుకున్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. దయ్యంలా ఉందని కొందరు, హాలీవుడ్ వచ్చిన ‘ది నన్’ అనే సినిమాను ఈమెతో తీయచ్చని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మేకప్ గురించి పెద్దగా తెలియదు అనుకుంటా.. ఆమెకు మేకప్ వేసిన వాళ్ళను అనాలి అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.