Netizens Trolls On Keerthy Suresh Dress In Director Venky Atluri's Wedding
mictv telugu

అవకాశాల్లేకనే ఇలాంటి డ్రెస్సా? కీర్తి సురేష్ మీద ట్రోలింగ్

February 2, 2023

 keerthy suresh trolled of her outfit in venky atluri wedding

మహానటి సినిమాతో ఒక్కసారి పాపులర్ అయిపోయింది కీర్తి సురేష్. తర్వాత చేసిన సినిమాలన్నీ పెద్దగా ఆడకపోయినా, ఇంకా ఆ పాపులారిటీతోనే నెట్టుకొచ్చేస్తోంది. తాజాగా టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి పెళ్ళికి హాజరై హల్ చల్ చేసింది కీర్తి. నితిన్, కీర్తి ఉన్న ఫోటోలు బాగా సర్క్యులేట్ అయ్యాయి. అయితే అవే ఇప్పుడు ఆమెకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాయి.

వెంకీ అట్లూరి పెళ్ళికి హాజరయిన కీర్తి సురేష్ రంగురంగుల డ్రస్ వేసుకుని వచ్చింది. చూడ్డానికి కలర్ ఫుల్ గా ఉన్న ఆ డ్రస్సే ఇప్పుడు ట్రోల్ అవుతోంది. ఆమె ఫాన్స్ అయితే ఆ రంగురంగుల డ్రస్ లో హరివిల్లులా ఉందని మురిసిపోతున్నారు కానీ మరికొంత మంది మాత్రం ఏంటా డ్రస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన ఫ్యాషన్ సెన్స్ చాలా చెత్తగా ఉందంటూ విమర్శిస్తున్నారు. టెంట్ ను గ్రెస్ గా కుట్టించుకుందని సెటైర్లు వేస్తున్నారు.

ఇంతకు ముందు నీ డ్రెస్ సెన్స్ తెగ నచ్చేది, ఇప్పుడు మాత్రం మైనస్ 1 మార్క్స్ ఇస్తున్నా అంటూ ఒకరు కామెంట్ చేశారు. షామియానా లెహంగా, మరేం అనుకోనంటే ఓ మంచి స్టైలిష్ ను పెట్టుకో, ఆ డిజైనర్ ను తగలెట్టేయ్, పాపం అవకాశాలు లేక ఇలాంటి డ్రస్ లు వేసుకుంటున్నావా అంటూ వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. పాపం ఏ ముహూర్తాన ఆ డ్రస్ వేసుకోవాలని నిర్ణయించుకుందో కానీ అనవసరంగా ట్రోల్ అయిపోతోంది.

ఇవి కూడా చదవండి : 

మరోసారి మంచి మనస్సు చాటుకున్న మెగాస్టార్..

పెళ్ళి వైపు అడుగులు వేస్తున్న మరో బీటౌన్ జంట